హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ చాలెంజ్‌కు విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక ఫిలిం మేకర్స్ విజ్ఞప్తి మేరకు పోటీలో పాల్గొనే గడువును వచ్చే నెల 2వ తేదీ వరకు పొడిగించారు. సోమవారం ఎఫ్డీసీ ఆఫీస్‌లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఎఫ్డీసీ ఎండీ ముకుంద రెడ్డి, ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజు, జ్యూరీ కమిటీ చైర్మన్ హరీశ్ శంకర్ ఆధ్వర్యంలో అన్ని జ్యురీ కమిటీల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, ఎఫ్డీసీ ఈడీ కిశోర్ బాబు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ హరికృష్ణ, విమలక్క, కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు.
